టాలీవుడ్ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో బుధవారం షాక్ తగిలింది. డ్రగ్స్ కేసు నుంచి ఊరట కలిగించాలని నవదీప్ దాఖలు పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆయనకు 41ఏ కింద నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. మాదాపూర్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ఆయనను ఏ29గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో డియర్ మేఘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.