దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా 'యానిమల్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా చేస్తోంది. ఈ సినిమా లుక్ ఆమధ్య విడుదలచేసినప్పుడు దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ విడుదలచేయాలని టీం భావిస్తోంది. రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 28న ఈ సినిమా టీజర్ విడుదల చెయ్యడానికి టీము సంసిద్ధం అవుతోంది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా టీము టీజర్ విడుదల తేదీని ప్రకటించడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa