ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గాండీవధారి అర్జున' ట్రైలర్ విడుదలకి డేట్ అండ్ టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 08, 2023, 06:38 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. యాక్షన్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'గాందీవధారి అర్జున' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని ఆగస్ట్ 10, 2023న డిజిటల్‌గా లాంచ్ చేయనున్నట్లు అంతేకాకుండా హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ప్రత్యేక ప్రీమియర్ కూడా ఉంటుంది అని మొత్తం టీమ్ ఈవెంట్‌కు హాజరవుతుంది  అని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం వీడియో గ్లింప్సె ని విడుదల చేసారు.

ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో వరుణ్ సరసన జోడిగా సాక్షి వైద్య కనిపించనుంది. విమలా రామన్, నాజర్ మరియు వినయ్ రాయ్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ అండ్ బాపినీడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa