ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే 'పరేషాన్' డిజిటల్ ఎంట్రీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2023, 08:09 PM

రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వంలో యంగ్ హీరో తిరువీర్ నటించిన 'పరేషన్' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ ఫన్ ఫ్లిక్ యొక్క OTT హక్కులను సోనీ LIV సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు, ఆగస్ట్ 4, 2023న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.


ఈ చిత్రంలో పావని కరణం కథానాయికగా నటించింది. ఈ సినిమాలో బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బుద్దెరా ఖాన్, రవి మరియు రాజు బెడిగల కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పించగా వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. యశ్వంత్ నాగ్ ఈ చిత్రాన్ని సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa