అమిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీక్వెల్ మూవీ ‘ఓ మై గాడ్ 2’పై భారీ అంచనాలే పెరిగాయి. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్‌లు ప్రేక్షకులపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్షయ్ కుమార్ శివుడిగా, మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి భక్తుడిగా కనిపిస్తున్నాడు. లాయర్ పాత్రలో యామి గౌతమ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆగస్టు 11న సినిమా రిలీజ్ కాబోతుంది.