రొమాంటిక్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి నటి కేతిక శర్మ ఎంట్రీ ఇచ్చింది. వరుస సినిమాలతో ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. కేతిక హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మోడలింగ్ నుంచి సినిమా వైపు వచ్చినప్పుడు నా ప్రైవేట్ పార్ట్స్ గురించి నీచంగా కామెంట్స్ చేసేవారు. డ్రమ్ములా ఉన్నావు, నీకెందుకు సినిమాలంటూ నిలదీసేవారు. అప్పుడు నాకు చాలా బాధేసింది.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa