మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ మరియు వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన 'మామన్నన్' విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి సమీక్షలను అందుకుంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు తెలుగులో 'నాయకుడు' అనే టైటిల్ తో జూలై 14న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజగా ఈ బ్లాక్ బస్టర్ మామన్నన్ జూలై 27 నుండి తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాని రెడ్ జెయింట్ మూవీస్ యొక్క M షెంగాబాగ్ మూర్తి మరియు R అర్జున్ దురై నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa