ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని చేయనున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మూవీ టీమ్ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ధృవీకరించే వరకు మనం వేచి చూడాలి.
గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ సినిమాకి అకాడమీ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa