ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'LGM' ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న మిస్టర్ అండ్ మిసెస్ ధోని

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2023, 07:26 PM

భారత క్రికెటర్ ఎంఎస్ ధోని కోలీవుడ్‌లో ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో తన తొలి నిర్మాణాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. డైరెక్టర్ రమేష్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'LGM' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఇందులో హరీష్ కళ్యాణ్ మరియు ఇవానా ప్రధాన పాత్రలు పోషించారు.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, మిసెస్ అండ్ మిస్టర్ ధోని చెన్నైలో ధోని ఎంటర్‌టైన్‌మెంట్ యొక్క తొలి ప్రొడక్షన్ LGM యొక్క ఆడియో మరియు ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ చిత్రంలో నదియా, యోగి బాబు, మిర్చి విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామాకి దర్శకుడు రమేష్ తమిళమణి స్వయంగా సంగీతం అందిస్తున్నారు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa