మహేష్ బాబు.పి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజా మేకర్స్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు4వ తేదీన సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.