ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సినిమా ‘హనుమాన్’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫోటోలకు మంచి స్పందన అందుకున్నాయి. తాజాగా చిత్రయూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. అయితే అదే సమయంలో ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కే’, మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్’ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ బడా స్టార్ల సినిమాలను ‘హనుమాన్’ తట్టుకుని నిలబడుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa