దివంగత సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సినిమా 'మోసగాళ్లకు మోసగాడు'. ఈ సినిమాలో కృష్ణ గారు కౌబాయ్ పాత్రలో నటించారు. ఈ సినిమా అప్పట్లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాని పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా 4K టెక్నాలజీతో మే 31న థియేటర్లో మరోసారి రీరిలీజ్ కాబోతుంది. ఈ నెల 31న ఆయన జయంతి వేడుకలు జరగనున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతికి నివాళిగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నాం ఆది శేషగిరిరావుఆయన తెలిపారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించచారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, బి గోపాల్, అశ్వినిదత్, నిర్మాత రామలింగేశ్వర రావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa