ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 15, 2023, 07:14 PM

హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్  పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ చిత్రం యొక్క తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు. అంతేకాకుండా మూవీ టీమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ సెట్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa