కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా 'సూర్య 42' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది.
తాజాగా ఇప్పుడు, ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా యొక్క ఆడియో రైట్స్‌ని సరిగమ లేబుల్ సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa