సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా 'మళ్లీ పెళ్లి'. సీనియర్ నటీనటులు నరేశ్, పవిత్రా లోకేశ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ స్టోరీ లైన్ తో రానుంది.'ఏడు అడుగులు, రెండు మనసులు, ఒకటే ప్రాణం' అంటూ దర్శకుడు సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను విడుదల చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఏప్రిల్ 13న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నరేశ్, పవిత్రల లిప్ లాక్ వీడియోను చూసి చాలా మంది వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నట్టుగా పొరపడ్డారు.నరేశ్ వ్యక్తిగత వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రావడంతో సహజంగానే క్యూరియాసిటీని పెంచేసింది. నరేశ్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల, జయసుధ, శరత్ బాబు, వనితా విజయ్ కుమార్ వంటి వారు నటిస్తున్నారు.
ఏడు అడుగులు, రెండు మనసులు, ఒకటే ప్రాణం!
Experience the Magic of Love with #MalliPelli Teaser
RELEASING ON APRIL 13th
@ItsActorNaresh & #PavitraLokesh
Directed by @MSRajuOfficial
Summer 2023 Release!@vanithavijayku1 @VKMovies_ @EditorJunaid @adityamusic pic.twitter.com/dFq8YRknPP
— MS Raju (@MSRajuOfficial) April 8, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa