ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'దసరా' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 04:01 PM

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని "దసరా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. తాజగా దసరా నిర్మాతలు తమ అధికారిక సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా ఈ చిత్రం యొక్క గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 26, 2023న అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు సరికొత్త పోస్టర్‌ను కూడా మూవీ మేకర్స్ విడుదల చేశారు.

యాక్షన్ డ్రామాగా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 30 , 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa