శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న PKSDT క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన బ్లాస్టింగ్ న్యూస్ ని కాసేపటి క్రితమే మేకర్స్ ఎనౌన్స్ చేసారు. అదేంటంటే, PKSDT జూలై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఎలాంటి ముందస్తు ఎనౌన్స్మెంట్ లేకుండా వచ్చిన ఈ సర్ప్రైజింగ్ న్యూస్ తో మెగా అభిమానుల్లో ఫుల్ ఖుషీ నెలకొంది.
నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa