ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న "లియో"

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 01:18 PM

కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న "లియో" శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. గత నెలలో కాశ్మీర్ లో చిత్రీకరణ ప్రారంభించిన ఈ సినిమా అక్కడి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు అక్కడి ప్రతికూల వాతావరంలో తమ క్యాస్ట్ అండ్ క్రూ పడ్డ కష్టానికి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రబృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలో తలపతి విజయ్, త్రిష, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సంజయ్ దత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 19వ తేదీన విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa