కన్నడ సెన్సేషనల్ హిట్ "కాంతార" పాన్ ఇండియా భాషల్లో విడుదలై, అన్ని చోట్లా ఘనవిజయం సాధించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.
ఇటీవలే .. కాంతార ఒక ఫ్రాంచైజీగా రాబోతుందని నిర్మాత విజయ్ కిరంగదుర్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు ఉగాది పండుగను పురస్కరించుకుని కాంతార మేకర్స్ సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, కాంతార రెండవ భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను రిషబ్ శెట్టి షురూ చేసారని అధికారిక ప్రకటన విడుదలయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa