అతి త్వరలోనే 'ఉగ్రం' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్న హీరో అల్లరి నరేష్ నుండి ఈ రోజు మరొక కొత్త సినిమా అధికారిక ప్రకటన జరిగింది. మల్లి అంకం అనే కొత్త దర్శకుడి నేతృత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించబోతున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ సినిమా నరేష్ కెరీర్ లో 61వది.
ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా అధికారికంగా లాంఛనమయ్యింది. పూజా కార్యక్రమానికి సినీప్రముఖులు విచ్చేసారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు గారు ఫస్ట్ క్లాప్ నివ్వగా, ఫస్ట్ షాట్ కి నాగ్ అశ్విన్ గౌరవ దర్శకత్వం వహించారు. తరుణ్ భాస్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa