మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా, దర్శకుడు నక్కిన త్రినాథరావు రూపొందించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ "ధమాకా". ఈ సినిమా తదుపరి నక్కిన త్రినాధరావు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉగాది కానుకగా ఈ రోజే ఎనౌన్స్ చెయ్యబడింది.
హీరో నాగశౌర్య హోమ్ బ్యానర్ ఐరా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 5 గా తెరకెక్కబోతున్న ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి నక్కిన త్రినాధరావు గారు డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా జరిగింది. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్ మూల్పూరి నిర్మిస్తున్నారు. మరి, ఇందులో హీరోగా నాగశౌర్య నటిస్తారా? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa