అల్లు శిరీష్ నటించిన కొత్త చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లలో విడుదలై చాలామంచి రెస్పాన్స్ అందుకుంది. చాన్నాళ్ల బట్టి సాలిడ్ హిట్ లేని శిరీష్ ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్నారు.
థియేటర్లలో, ఓటిటిలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెర సందడికి సిద్ధమయ్యింది. మార్చి 26 సాయంత్రం ఆరింటికి ప్రముఖ బుల్లితెర ఛానెల్ జెమినీ టీవిలో ఊర్వశివో రాక్షసివో మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది.
సునీల్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, ఆమని ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, విజయ్ నిర్మించారు. అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa