సిజ్లింగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇటీవల 'క్రిస్టీ' సినిమాలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. మాస్టర్ నటి ప్రభాస్-మారుతి సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజగా ఇప్పుడు ఈ గ్లామర్ బ్యూటీ మరో తెలుగు బిగ్గీపై సంతకం చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' లో ఆమె ప్రధాన నటీమణులలో ఒకరిగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బెంగళూరు బ్యూటీ శ్రీలీల మరో ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉంది. మూవీ మేకర్స్ నుండి ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావలిసిఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa