మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "రావణాసుర" నుండి కాసేపటి క్రితమే థర్డ్ సింగిల్ 'వెయ్యిన్నొక్క' అనే రెట్రో స్టైల్ లో ఉన్న పెప్పి సాంగ్ విడుదలయ్యింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించారు. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే.. అని సాగే ఈ పాట హీరోయిన్ మేఘా ఆకాష్ ని రవితేజ టీజ్ చేస్తూ పాడతారు.
సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. రవితేజ, అభిషేక్ నామ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa