కొంతసేపటి క్రితమే ధమ్కీ ట్రైలర్ 2.O విడుదలయ్యింది. గతంలో విడుదలైన ట్రైలర్ 1 కి రెట్టింపు క్లాస్, మాస్, యాక్షన్, ఎమోషన్, ఎలిమెంట్స్ తో లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ ఉత్కంఠను మరింత పెంచుతుంది. మొత్తంగా ధమ్కీ ట్రైలర్ ...విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షో... గా నడిచింది.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈ సినిమాలో రోహిణి, రావు రమేష్, అజయ్, హైపర్ ఆది, మహేష్ ఆచంట, పృథ్వి రాజ్ తదితరులు నటించారు.లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
విశ్వక్ సేన్ సినిమాస్, వణ్మయి క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లపై కరాటే రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈనెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశేషమేంటంటే, పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa