కుగ్రామం నుండి వచ్చిన ఒక యువకుడు పైలట్ స్థాయికి ఎలా ఎదిగాడు? జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఎలాంటి యుద్ధం చేసాడు? అనే నేపథ్యంలో దర్శకుడు ఫణిదీప్ తెరకెక్కిస్తున్న చిత్రం "ఉస్తాద్". ఈ సినిమాలో శ్రీసింహ, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీరోల్ లో నటిస్తున్నారు.
తాజాగా ఈ రోజు హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ ని 'అన్ ప్రెడిక్టబుల్ పోరి' మేఘనగా పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. అందం, తెలివితేటలు నిజాయితీ కలగలిసిన ఒక స్ట్రాంగ్ సోల్ - మేఘన .. అంటూ వివరిస్తూ కావ్యా కళ్యాణ్ రామ్ పాత్రని పరిచయం చెయ్యడంతో, ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa