నటసింహం నందమూరి బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ నయనతార, స్నేహా ఉల్లాల్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం "సింహా". బాలయ్యను మొట్టమొదటి సారి డైరెక్ట్ చేసిన బోయపాటి శ్రీను ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. అలానే వీరి కాంబోలో వచ్చిన లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలవడంతో, ఈ కాంబోపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఏప్రిల్ 10, 2010లో విడుదలైన ఈ సినిమా రేపు మరోసారి బిగ్ స్క్రీన్స్ పై సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. మరి, బాలయ్య నటసింహావతారాన్ని మరోసారి థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేసేందుకు అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసారు. చక్రి సంగీతం అందించారు. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మించారు. నమిత, రెహమాన్, సాయి కుమార్, KR విజయ, ఆదిత్య మీనన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa