DY చౌదరి దర్శకత్వంలో రోహిత్ బాహెల్, అపర్ణా జనార్ధనన్ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "లవ్ యూ రామ్". దర్శకుడి నుండి నిర్మాతగా మారిన కే దశరధ్ నిర్మిస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాకు కే వేదా సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి 'ఉండాలని ఉంది' అనే మెలోడియస్ లవ్ సాంగ్ యొక్క ప్రోమో విడుదలయ్యింది. ప్రోమో సూథింగ్ మెలోడీగా ఆకట్టుకుంటుంది. ఫుల్ సాంగ్ మార్చి 4వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సాంగ్ లాంచ్ కోసం మేకర్స్ గుంటూరు VVIT, విజ్ఞాన్ డిగ్రీ & పీజీ కాలేజీలలో గ్రాండ్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa