తెలుగు, తమిళ భాషల్లో గత నెల 17న విడుదలైన "సార్/వాతి" మూవీ ఇరు భాషల ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సార్ కలెక్షన్లు సాలిడ్ గా నమోదవుతున్నాయి.
తాజాగా ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును గెలుచుకున్న కే రంగయ్య ను సత్కరించారు. ఆయనను కలిసి చిత్రం గురించి చర్చించారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa