కోలీవుడ్ నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గత సంవత్సరం యూత్ ఫుల్ తమిళ ఎంటర్‌టైనర్ 'లవ్ టుడే' తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఈ చిత్రం అదే టైటిల్‌తో తెలుగులోకి డబ్ చేయగా బాక్సాఫీస్ వద్ద సెన్సషనల్ రికార్డుస్ ని సృష్టించింది. తాజాగా ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ తదుపరి చిత్రం ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్నట్లు సమాచారం. ఈ యూత్‌ఫుల్ డ్రామాకి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రదీప్ ఇందులో ఒక ముఖ్య పాత్రలో కూడా నటించనున్నాడు అని లేటెస్ట్ టాక్. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ AGS ఎంటర్‌టైన్‌మెంట్ త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa