మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా గారి బాణీలు, స్వర్గీయ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం, పలువురు గాయకుల అద్భుతమైన గాత్రంతో రంగమార్తాండ సాంగ్స్ శ్రోతలను మైమరిపిస్తున్నాయి. తాజాగా ఈ రోజు ఉదయం సోల్ ఆఫ్ రంగమార్తాండ రిప్రైజ్డ్ వెర్షన్ సాంగ్ విడుదలయ్యింది.
కళనే కొలిచే నువ్వు.. కలవే అయిపోయావు.. మైమరిపించే మైకాన్ని ఎపుడొదిలేసావు.. అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూసావు.. అంటూ గద్గద స్వరంతో స్వయంగా ఇళయరాజా గారు ఈ గీతాన్ని ఆలపించి, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు కాగా, కాలిపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణన్, రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన తారాగణం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa