శ్రీకాంత్ జి రెడ్డి డైరెక్షన్లో యువనటుడు నరేష్ అగస్త్య హీరోగా నటించిన చిత్రం "మెన్ టూ". ఇటీవల విడుదలైన టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన ఈ సినిమాపై చాలా మంచి అంచనాలు నెలకొన్నాయి. మగవాడిలా బతకడం అంత సులభమేమీ కాదు.. అనే కధాంశంతో ఫన్ అండ్ ఎంగేజింగ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను మే 5వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ ఈ రోజు విడుదలయ్యింది.
ఈ చిత్రంలో బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, రోహిణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్నారు.మౌర్య సిద్ధవరం నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa