సినిమా ప్రపంచంలో టాప్ డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరూన్ ఒకరు. ఈ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన అవతార్ సీక్వెల్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా భాషల్లో విడుదలయ్యి ప్రపంచంలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. 2022 డిసెంబర్ మధ్యలో విడుదలైన ఈ సినిమా టైటానిక్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో సినిమాగా నిలిచింది.
ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో సామ్ వర్తింగ్టన్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో జో సల్దానా, సామ్ వర్తింగ్టన్, సిగౌర్నీ వీవర్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు TSG ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అవతార్ 2 యొక్క గ్రాండ్ సక్సెస్‌తో మావెరిక్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మొత్తం $95 మిలియన్లకు పైగా సంపాదించాడు. ఇది 2022 సంవత్సరంలో అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన దర్శకుల లిస్ట్ లో దర్శకుడు అగ్రస్థానంలో నిలిచేలా చేసింది. అవతార్ ఫ్రాంచైజీలో మూడవ భాగం అవతార్ : ది సీడ్ బేరర్ డిసెంబర్ 20, 2024న తెరపైకి రావడానికి షెడ్యూల్ చేయబడింది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు కొన్ని రోజులలో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa