శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై వర్ష ముందాడ, మాధవి నిర్మిస్తున్న చిత్రం "తెలుసా మనసా". వైభవ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కేరింత ఫేమ్ పార్వతీశం, జశ్విక జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటీమణి రోహిణి హట్టంగడి, అలీ రెజా కీరోల్స్ లో నటిస్తున్నారు.
ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'మనసు మనసుతో' అనే సోల్ ఫుల్ మెలోడియస్ సాంగ్ విడుదలయ్యింది. శ్రీకృష్ణ ఆలపించిన ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించారు. పోతే, ఈ పాటను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి విడుదల చేసి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa