నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ వాలెంటైన్స్ డే సందర్భంగా రేపు మరోసారి థియేటర్లకు రాబోతుంది. ఈ ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమికులందరూ కలిసి సరదాగా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసే విధంగా ఫిబ్రవరి 14వ తేదీ ఒక్కరోజు మాత్రమే ఈ సినిమాను విడుదల చెయ్యడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రీహరి, సునీల్, అర్చన, జయప్రకాష్ కీరోల్స్ లో నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై MS రాజు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa