కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం "దసరా". ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన 'దోస్తానా' పాటకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ రాగా, ఈ రోజు సెకండ్ సింగిల్ ను విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. కాసేపటి క్రితమే మేకర్స్ నుండి మరొక ఎనౌన్స్మెంట్ వచ్చింది. తెలుగులో మాత్రమే ఈ పాటను ఈ రోజు విడుదల చేస్తున్నట్టు, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మిగిలిన భాషల్లో ఈ పాటను ఈ రోజు విడుదల చెయ్యట్లేదని తెలిపారు. ఐతే, రేపు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో 'ఓరి వారి' విడుదల కాబోతుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa