MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఫిబ్రవరి 19, 2023న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం. నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో సముద్రఖని, బ్రహ్మాజీ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa