రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' సినిమా ఫిబ్రవరి 10, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ టెలివిజన్ ఛానల్ జెమినీ టీవీ ఈ థ్రిల్లర్ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. అంతేకూండా నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో కన్నడ నటి ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa