కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ భారత్ లోనే కాదు, ఓవర్ సీస్ లోనూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమా బుధవారం వరకూ కేవలం హిందీలోనే రూ.865 కోట్ల కలెక్షన్లు సాధించి ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఇండియాలో రూ.536 కోట్ల కలెక్షన్లు సాధించగా, ఓవర్ సీస్ లో రూ.329 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని జనవరి 25న 7,700 స్క్రీన్స్ లో విడుదల చేశారు.