ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరో కాంట్రవర్సీకి తెరలేపారు. ఇటీవల ‘ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేరళ’ ఈవెంట్ లో ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రస్తావన తెచ్చారు. ‘అర్థం పర్థం లేని సినిమాల్లో కశ్మీర్ ఫైల్స్ ఒకటి. దాన్ని ఎవరు నిర్మించారో మనకందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా దీన్ని పట్టించుకోలేదు. కానీ, వాళ్లకు సిగ్గు రాలేదు. ఇదో ప్రాపగాండా సినిమా. ప్రజల్ని ఎప్పుడూ మోసపుచ్చలేరు.’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.