RRR పాన్ ఇండియా సక్సెస్ తదుపరి నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ చాలా సమయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో ఒక మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్ ఆ మూవీకి సంబంధించి ఎలాంటి లూప్ హొల్స్ లేకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ నెల్లోనే మంచి రోజు చూసుకుని ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ని పూజా కార్యమాలతో లాంఛనంగా ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే నెల లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. ఈ మేరకు జోరుగా ప్రచారమైతే జరుగుతుంది కానీ, అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అంతా వెయిటింగ్.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్త బ్యానర్లలో రూపొందబోతున్న ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa