ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'NBK108' లో బాలకృష్ణ కు జోడిగా కాజల్ అగర్వాల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 05:15 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా 'NBK108' అనే టైటిల్ ని పెట్టారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. NBK108ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa