ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలపతిని కలిసిన 'మైఖేల్'..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 12:03 PM

రంజిత్ జయకొడి డైరెక్షన్లో యంగ్ హీరో సందీప్ కిషన్, దివ్యాన్ష కౌశిక్ జంటగా నటించిన సినిమా "మైఖేల్". ఇందులో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయా భరద్వాజ్ కీలకపాత్రల్లో నటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. మైఖేల్ టీజర్, ట్రైలర్ లతో ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


రేపు మైఖేల్ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న కారణంగా మైఖేల్ అకా సందీప్ కిషన్ కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తలపతి మైఖేల్ టీంకు బెస్ట్ విషెస్ తెలియచేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa