సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా, కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "రైటర్ పద్మభూషణ్". లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్ లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్, హెల్దీ కామెడీ, క్రేజీ లవ్, ఆసక్తిగొలిపే మలుపులతో రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలను నమోదు చెయ్యడంతో, ఆడియన్స్ అందరూ పద్మభూషణ్ రాక కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
పోతే, ఈ రోజు నుండే USA లో రైటర్ పద్మభూషణ్ ప్రీమియర్స్ జరగబోతున్నాయి. ఫ్లై హై సినిమాస్ USA లో 120 లొకేషన్స్ లలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తుంది. ఇరు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో రేపు రైటర్ పద్మభూషణ్ ఫ్యామిలీ సందడి చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa