కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, గానవి లక్ష్మణ్ జంటగా, దర్శకుడు A. హర్ష తెరకెక్కించిన చిత్రం "వేద". శివరాజ్ కుమార్ కి ఇది 125 సినిమా. రీసెంట్గానే కన్నడలో విడుదలై, ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల కాబోతుంది. కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ సంస్థ వేద సినిమాను తెలుగులో గ్రాండ్ గా విడుదల చేయబోతుంది.
పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగులో ఈనెల 9వ తేదీన విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ అఫీషియల్ రిలీజ్ పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ సినిమాకు అర్జున్ జన్య సంగీతం అందించారు. గీత పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై గీత శివరాజ్ కుమార్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa