కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో తలపతి 67 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మాస్టర్ కలయికలో రాబోతున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై చాలా మంచి అంచనాలున్నాయి. 7స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, తలపతి 67 మూవీ మ్యూజిక్ ఆల్బమ్ హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, శాండీ, గౌతమ్ మీనన్, మ్యాథ్యు థామస్, మన్సూర్ అలీఖాన్, మిస్కిన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa