'వారిసు' సినిమాతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గారు కోలీవుడ్ నిర్మాణరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అమేజింగ్ కలెక్షన్లను రాబడుతూ, ఫస్ట్ ఎటెంప్ట్ లోనే దిల్ రాజు గారికి భారీ లాభాలను ఆర్జించి పెడుతుంది. తాజాగా ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 200కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. అలానే నార్త్ అమెరికాలో వారిసు /వారసుడు కలెక్షన్స్ 1. 5 మిలియన్ డాలర్ కి చేరుకున్నాయి.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటించారు. థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa