కలర్ ఫోటో ఫేమ్ సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటిస్తున్న చిత్రం "రైటర్ పద్మభూషణ్". కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఆశిష్ విద్యార్ధి, రోహిణి మొల్లేటి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుహాస్ అసిస్టెంట్ లైబ్రేరియన్ గా నటిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 3న విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు 20వ తేదీ సాయంత్రం 04:05 నిమిషాలకు రైటర్ పద్మభూషణ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa