రీసెంట్ సూపర్ హిట్ "హిట్ 2"లో సర్ప్రైజింగ్ రోల్ లో నటించి, తనలోని విలక్షణ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసి క్రేజ్ పెంచుకున్నారు నటుడు సుహాస్.
ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం "ఆనందరావ్ అడ్వెంచర్స్" యొక్క పూజా కార్యక్రమం ఈ రోజే గ్రాండ్ గా జరిగింది. రామ్ పసుపులేటి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను ఉదయ్ కోలా, విజయ్ శేఖర్, సురేష్ కొత్తింటి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. పూజా కార్యక్రమానికి రానా, క్రిష్, ఆనంద్ దేవరకొండ, BVS రవి హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలను తెలియచేసారు.
ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa