ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ రిలీజ్ చెయ్యనున్న 'కళ్యాణం కమనీయం' వెడ్డింగ్ యాంథెం ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 10, 2023, 09:49 AM

యంగ్ హీరో సంతోష్ శోభన్ ను పాన్ ఇండియా సూపర్ స్టార్, అభిమానుల డార్లింగ్ ప్రభాస్ సపోర్ట్ చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. ఈ మేరకు గతంలో సంతోష్ నటించిన కొన్ని సినిమాలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రభాస్ ప్రమోట్ చేసారు.


తాజాగా సంతోష్ శోభన్ నటిస్తున్న "కళ్యాణం కమనీయం" సినిమా ప్రొమోషనల్ సాంగ్ 'వెడ్డింగ్ యాంథెం' ను డార్లింగ్ ప్రభాస్ ఈ రోజు మధ్యాహ్నం 02:07 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు, ఈ సినిమాను నిర్మిస్తున్న యూవీ కాన్సెప్ట్స్ సంస్థ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది.


అనిల్ కుమార్ ఆళ్ల డైరెక్షన్లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో కోలీవుడ్ నటి ప్రియా భవాని శంకర్ టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa